Maha Shivratri Special Story in Telugu
Maha Shivratri Special story in Telugu : ఓం నమః శివాయ 🙏🙏🙏 ఫిబ్రవరి 26 వ తేది మహాశివరాత్రి సందర్భంగా.. ఆ మహాదేవుని ఎన్ని రకాలుగా పూజించవచ్చు..? అసలు శివ లింగాలు ఎన్ని రకాలు…? వాటి ఫలితాలు ఏమిటి…? వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఓం నమః శివాయ ఓం అరుణాచల శివ హరహర మహాదేవ శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది. బిల్వ దళం ప్రాముఖ్యత: బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ.బిల్వం ఇంటి అవ రణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తూర్పున ఉంటే సౌఖ్యం. పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షిణాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది. ఓం నమః శివాయ..హర హర మహాదేవ శంభో శంకర.. 30 రకాల శివలింగాలు.. …