Manidweepa Varnana Lyrics in Telugu.
Manidweepa Varnana Lyrics in Telugu: మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సుల లో కొలువై ఉంది || 1 || సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు || 2 || లక్షల లక్షల లావన్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు || 3|| పారిజత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు || 4 || భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు || 5 || అరువది నాలుగు కళామతల్లులు వరలనోసగే పదారుశక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 6 || అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు సృష్టికర్తల సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు || 7 || కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు || 8 || భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్న రాశులు మణిద్వీపానికి మహానిధులు || 9…